కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల భౌగోళిక పరిమాణాలను మరింత వాస్తవికంగా చూపించే కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం మద్దతు తెలిపింది. టోగో నేతృత్వంలో తీసుకొచ్చిన ఈ తీర్మానానికి 164 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, అమెరికా ఒక్కటే వ్యతిరేకంగా ఓటు వేసింది. మరో ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ‘ఈక్వల్ ఎర్త్’ (Equal Earth) మ్యాప్ ఆధారంగా ప్రపంచ పటాలను రూపొందించడాన్ని ప్రోత్సహించేలా ఈ తీర్మానం ఉంది. ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగిస్తున్న మెర్కేటర్ ప్రొజెక్షన్లో ధ్రువ ప్రాంతాలకు సమీపంలోని భూభాగాలు వాస్తవ...