స్థానిక ఎన్నికల్లో విజయమే ధ్యేయం: కాకాణి గోవర్ధన్‌రెడ్డి

మనుబోలు, సెప్టెంబర్ 16: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని, ప్రకృతి సంపద, ప్రభుత్వ భూముల విషయంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని కాకాణి ఆరోపించారు. సాగునీటి సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. గొలగమూడి వద్ద...