పల్లె పండుగ 3.0తో గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం, ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ

నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్: గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. మంగళవారం నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామంలో పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, రూ.1.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పశువుల పాక (క్యాటిల్ షెడ్) నిర్మాణ పనులకు ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...