కన్నుల పండుగగా వినాయక చవితి వేడుకలు

చౌడేపల్లి, సెప్టెంబర్ 15 (సత్య వెలుగు న్యూస్):చౌడేపల్లి మండల వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో వీధివీధినా ప్రత్యేకంగా వినాయక మండపాలను ఏర్పాటు చేసి, గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు గణపయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం వేళల్లో పెద్ద సంఖ్యలో భక్తులు మండపాలకు చేరుకుని బొజ్జ గణపయ్యను దర్శించుకుని తొలి పూజలు అందుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది....