శ్రీకాళహస్తి: సత్య వెలుగు న్యూస్ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయం వద్ద నియోజకవర్గ వీఆర్ఏలు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.
పే స్కేల్ అమలు చేయడంతో పాటు నామినీల నియామకం, అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని సంఘం అధ్యక్షుడు మధ్యల బాలగురవయ్య, ఇతర నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు.