sathyavelugu.com
Date of Publish : 04 September 2026, 10:29 pm Posted by : KUMPATI SURESH

ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు; మహిళలు, చిన్నారుల రక్షణ నుంచి సైబర్ నేరాలు, రోడ్డు భద్రత వరకు చైతన్యం

దొరవారిసత్రం,సత్య వెలుగు న్యూస్ : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రినాధ్ ఇండస్ట్రీస్‌లో మహిళలు, చిన్నారుల భద్రత, పోక్సో, పోష్ చట్టాలు, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్, రోడ్డు భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

గాజులమాన్యం పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి కమిటీ సభ్యులతో సమావేశమై ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సూచనలు చేశారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్‌.సి.పురం జంక్షన్‌లో వాహనదారులకు హెల్మెట్ ధారణ, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

వరదయ్యపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగనాదపురం, ఎం.జి.నగర్ గ్రామాల్లో గంజాయి నిర్మూలన, సైబర్ నేరాలు, వినాయక చవితి, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వెంకటగిరి పరిధిలోని పెరియవరం గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, మహిళలపై నేరాల నివారణపై చైతన్యం కల్పించారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువగా పనిచేస్తోందని అధికారులు తెలిపారు.