ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు; మహిళలు, చిన్నారుల రక్షణ నుంచి సైబర్ నేరాలు, రోడ్డు భద్రత వరకు చైతన్యం

దొరవారిసత్రం,సత్య వెలుగు న్యూస్ : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రినాధ్ ఇండస్ట్రీస్‌లో మహిళలు, చిన్నారుల భద్రత, పోక్సో, పోష్ చట్టాలు, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్, రోడ్డు భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గాజులమాన్యం పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి కమిటీ సభ్యులతో సమావేశమై ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సూచనలు చేశారు. తిరుపతి రూరల్ పోలీస్...