మహిళా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం — ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ
నాయుడుపేట, సెప్టెంబర్ 25: మహిళల భద్రత, సంక్షేమం, సాధికారతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మహిళా ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మహిళల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజాదర్బార్లో మొత్తం 1,506 అర్జీలు అందగా, ఆయా సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను...