నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్న వైసీపీ నాయకులు: ఎమ్మెల్యే విజయశ్రీ

నాయుడుపేట: గత ఐదేళ్లుగా నిరుద్యోగుల జీవితాలతో వైసీపీ నాయకులు ఆటాడుకున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆరోపించారు. ఆదివారం నాయుడుపేటలో డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్లుగా ఎంపికైన సురేంద్ర, సీహెచ్. గీతాంజలి నివాసాలకు వెళ్లిన ఎమ్మెల్యే వారిని శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో ప్రతిభ ఆధారంగా అర్హులైన యువతకు ఉద్యోగాలు కల్పిస్తుంటే, వైసీపీ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఉద్యోగాలు సాధించిన యువతే దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలని పేర్కొన్నారు....