వైఎస్సార్ 17వ వర్ధంతి.. ఇడుపులపాయలో వైఎస్ జగన్ నివాళులు
ఇడుపులపాయ: దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. వైఎస్సార్ తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఘాట్‌కు చేరుకుని తండ్రి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్సార్‌ను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఘాట్ వద్ద కొద్దిసేపు గడిపారు. వైఎస్సార్‌కు నివాళులు అర్పించేందుకు వైఎస్సార్ అభిమానులు, పార్టీ నాయకులు,...