sathyavelugu.com
Date of Publish : 30 October 2026, 11:44 am Posted by : Dr. S.sudhakar

అమరం కండ్రిగ అంగన్వాడీ కేంద్రంలో అపరిశుభ్ర వాతావరణం!

-చెట్ల పొదలతో విషపూరిత జీవుల భయం..

-బాత్రూం సౌకర్యం లేక చిన్నారుల ఇబ్బందులు!

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు ,అక్టోబర్ 30:

అమరం కండ్రిగ: గ్రామంలోని అంగన్వాడీ పాఠశాల ఆవరణంలో చెట్లు, పొదలు విపరీతంగా పెరిగిపోవడంతో చిన్నారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాల చుట్టూ దట్టంగా పెరిగిన చెట్ల పొదల్లో విషపూరిత పాములు, ఇతర ప్రమాదకర జీవులు ఉండే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు కనీసం బాత్రూం సౌకర్యం కూడా లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. చిన్నారుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పాఠశాల ఆవరణంలో పెరిగిన చెట్లు, పొదలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చడంతో పాటు చిన్నారులకు బాత్రూం సౌకర్యం కల్పించాలని అధికారులను గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నారుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.