ఎస్సీ పురం టోల్‌గేట్‌ వద్ద వాహనదారుల ఆందోళన!

-సిబ్బంది, యాజమాన్యం దురుసు ప్రవర్తనతో భయాందోళనలో ప్రయాణికులు -ఫాస్ట్‌ట్యాగ్‌ పనిచేయకపోయినా ఇబ్బందులేనా?         -నెలవారీ పాస్‌ ఉన్నా ఎంట్రీ లేదా? పుత్తూరు, అక్టోబర్ 26, సత్య వెలుగు న్యూస్: తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని ఎస్సీ పురం టోల్‌గేట్‌ వద్ద వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, టోల్‌గేట్‌ సిబ్బంది వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఫాస్ట్‌ట్యాగ్‌ సాంకేతిక సమస్యలు, నెలవారీ పాస్‌ ఉన్నప్పటికీ ఎంట్రీ కనిపించడం లేదంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు సిబ్బంది, యాజమాన్యం దురుసు ప్రవర్తనతో తాము భయాందోళనకు...