కాణిపాకం టోల్గేట్ వద్ద రోడ్డు ప్రమాదం!
-ఆర్టీసీ బస్సు–ఈచర్ వాహనం ఢీ.. పలువురికి రక్తగాయాలు సత్య వెలుగు న్యూస్, పుత్తూరు అక్టోబర్ 23 : చిత్తూరు కాణిపాకం టోల్గేట్ సమీపంలోని నాలుగు రోడ్ల జంక్షన్లో ఆర్టీసీ బస్సు, ఈచర్ వాహనం ఢీకొన్న ఘటనలో పలువురికి రక్తగాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేదని సమాచారం. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు వైపు నుంచి కామలాపురం సర్వీసుకు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు, అదే సమయంలో మురుకంబట్టు వైపు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఈచర్ వాహనం నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఎదురుపడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది....