sathyavelugu.com
Date of Publish : 22 October 2026, 8:26 pm Posted by : Dr. S.sudhakar

కార్వేటినగరం జడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున గౌతమ్ రాజు సతీమణి నామినేషన్ దాఖలు

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు,  అక్టోబర్ 22: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కార్వేటినగరం జడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున గౌతమ్ రాజు సతీమణి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆమె నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.

ఈ సందర్భంగా కార్వేటినగరం ప్రాంతంలో రాజకీయంగా ఎన్నికల సందడి నెలకొంది. జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె పోటీ చేయనుండటంతో స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.