గుంతకల్‌లో మైనారిటీలకు కాంగ్రెస్‌ ప్రాధాన్యత.. ముస్లిం మహిళకు చైర్‌పర్సన్‌ టికెట్‌!

గుంతకల్, సత్య వెలుగు న్యూస్, అక్టోబర్ 20: గుంతకల్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలకు ప్రాధాన్యత కల్పిస్తూ, ముస్లిం మహిళకు మున్సిపల్ చైర్‌పర్సన్‌ టికెట్‌ కేటాయించి ప్రోత్సహించిన పార్టీ కాంగ్రెస్‌ అని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. సామాజిక న్యాయం, అన్ని వర్గాల ప్రజలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాల ప్రజలందరూ ఐక్యంగా నిలిచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి...