జీపీఎస్ ట్రాకింగ్‌తో మిస్సైన ఆర్టీసీ బస్సు ఆచూకీ గుర్తింపు

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, అక్టోబర్ 22 :తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి అదృశ్యమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) అద్దె బస్సును పోలీసులు జీపీఎస్ ట్రాకింగ్ సాయంతో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. నంద్యాల వైపు వెళ్తున్న బస్సును చాగలమర్రి పోలీసులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలోని గవర్నర్ పెట్ డిపోకు చెందిన ఈ బస్సు అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం తిరుపతికి చేరుకుంది. సెంట్రల్ బస్ స్టేషన్ ప్రాంగణంలో బస్సును నిలిపిన...