తిరుపతి జిల్లాలో ఎన్నికల భద్రతకు పటిష్ట చర్యలు

నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసుల నిఘా.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు తిరుపతి, అక్టోబర్ 20 (సత్య వెలుగు న్యూస్): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపడుతోంది. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పోలీసు నిఘా ఏర్పాటు చేస్తూ, ఎలాంటి...