sathyavelugu.com
Date of Publish : 21 October 2026, 5:46 pm Posted by : G.chengaiah

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పరిధిలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్

దొరవారిసత్రం,సత్య వెలుగు న్యూస్:తిరుపతి జిల్లా దొరవారిస త్రం   మండల పరిధిలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు లేకుండా తమ నామినేషన్లను దాఖలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు 

ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.