sathyavelugu.com
Date of Publish : 28 October 2026, 10:26 pm Posted by : Dr. S.sudhakar Rc Reportor Nagiri

తిరుపతి రూరల్ జెడ్పీటీసీ బరిలో స్వతంత్ర అభ్యర్థి ప్రవీణ్ కుమార్ (బిట్టు)!

-ఏసీ గుర్తు కేటాయింపు.. వరుస సంఖ్య 5కు ఓటు వేయాలని అభ్యర్థన

సత్య వెలుగు న్యూస్, తిరుపతి,  అక్టోబర్ 28 : రానున్న జెడ్పీటీసీ ఎన్నికల్లో తిరుపతి రూరల్ జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రవీణ్ కుమార్ (బిట్టు)కు ఎన్నికల అధికారులు ఏసీ గుర్తును కేటాయించారు. బ్యాలెట్‌లో వరుస సంఖ్య 5 వద్ద ఉన్న ఏసీ గుర్తును గుర్తుంచుకొని తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

ప్రజాసేవే నా లక్ష్యం.. ప్రజా సమస్యలపై పోరాటమే నా కర్తవ్యం అని ప్రవీణ్ కుమార్ (బిట్టు) పేర్కొన్నారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, వారి సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడుతానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ప్రజా సంక్షేమం వంటి అంశాల్లో ప్రజలకు అండగా నిలుస్తానని తెలిపారు.

ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, వారి హక్కుల సాధన కోసం నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ప్రజలందరికీ తన ఎన్నికల గుర్తు ఏసీ — వరుస సంఖ్య 5 గురించి తెలియజేసి, తమ అమూల్యమైన ఓటును ఏసీ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రవీణ్ కుమార్ (బిట్టు) విజ్ఞప్తి చేశారు.