sathyavelugu.com
Date of Publish : 17 October 2026, 11:22 pm Posted by : Dr. S.sudhakar

నందిమంగళం రైల్వే బ్రిడ్జి వద్ద లైట్లు ఏర్పాటు చేయాలి

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు ,అక్టోబర్ 17:నందిమంగళం గ్రామంలోని రైల్వే బ్రిడ్జి వద్ద రాత్రివేళల్లో సరైన లైటింగ్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి పరిసరాల్లో చీకటి అలుముకోవడంతో కొండచిలువలు సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాదచారులు, ప్రయాణికులు రాత్రి సమయాల్లో భయాందోళనలకు గురవుతున్నారు.ఈ ప్రాంతంలో సరైన వెలుతురు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రైల్వే బ్రిడ్జి వద్ద వీధి దీపాలు ఏర్పాటు చేయాలని నందిమంగళం గ్రామ ప్రజలు మున్సిపాలిటీ కమిషనర్‌ను కోరుతున్నారుప్రజల ప్రాణ రక్షణకు ప్రాధాన్యతనిస్తూ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.