sathyavelugu.com
Date of Publish : 19 October 2026, 4:38 pm Posted by : Dr. S.sudhakar

నగరి 14వ వార్డు నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఎం. నరేందర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు

నగరి, సత్య వెలుగు న్యూస్, అక్టోబర్ 19:నగరి మున్సిపాలిటీలో 14వ వార్డు నుంచి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థిగా ఎం. నరేందర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.ఈ సందర్భంగా 14వ వార్డులో ఎన్నికల సందడి నెలకొంది. నామినేషన్ల ప్రక్రియతో మున్సిపల్ ఎన్నికల రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.