sathyavelugu.com
Date of Publish : 19 October 2026, 6:28 pm Posted by : G.chengaiah

నాయుడుపేటలో 162 నామినేషన్లు.. మున్సిపల్ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల

సత్య వెలుగు న్యూస్ | నాయుడుపేట: నాయుడుపేట మున్సిపాలిటీలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మొత్తం 162 నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో భాగంగా చైర్‌పర్సన్ పదవికి దాఖలైన 14 నామినేషన్లలో 10, వార్డు సభ్యుల పదవులకు దాఖలైన 166 నామినేషన్లలో 152 నామినేషన్లు ఆమోదం పొందినట్లు అధికారులు వెల్లడించారు.సోమవారం నిర్వహించిన పరిశీలనలో ఎలాంటి నామినేషన్లు తిరస్కరణకు గురికాలేదని పేర్కొన్నారు.

వార్డు సభ్యుల అభ్యర్థుల వివరాల ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నుంచి 68 మంది, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుంచి 58 మంది, స్వతంత్ర అభ్యర్థులు 12 మంది, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి 6 మంది, కాంగ్రెస్ నుంచి 3 మంది, జనసేన నుంచి 3 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం.

మున్సిప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారుతోంది. అభ్యర్థుల తుది జాబితా, తదుపరి ఎన్నికల షెడ్యూల్‌పై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.