నెలబల్లిలో వ్యవసాయ విద్యుత్ మోటార్ల చోరీ!

పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్ : నెలబల్లి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు తొమ్మిది మంది రైతులకు చెందిన వ్యవసాయ విద్యుత్ మోటార్లను చోరీ చేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో మోటార్లు చోరీకి గురికావడంతో సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రావులపాడు, భీమవరం ప్రాంతాల్లోనూ వరుస చోరీలు! ఇటీవల రావులపాడు, భీమవరం తదితర ప్రాంతాల్లో సైతం పదుల సంఖ్యలో వ్యవసాయ విద్యుత్ స్టార్టర్లు చోరీకి గురైనట్లు రైతులు చెబుతున్నారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో...