పుత్తూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు

-నామినేషన్ల చివరి రోజు అప్రమత్తమైన పోలీసులు.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు పుత్తూరు, అక్టోబర్ 23, సత్య వెలుగు న్యూస్: తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు, వారి అనుచరులు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల రాకపోకలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ ప్రత్యేక...