sathyavelugu.com
Date of Publish : 29 October 2026, 6:47 pm Posted by : Dr. S.sudhakar Rc Reportor Nagiri

పుత్తూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా పీడీ నారాయణస్వామి!

-36 వార్డుల ప్రజలకు సేవ చేస్తా..

-సమస్యల పరిష్కారానికి ముందుంటా: పీడీ నారాయణస్వామి

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, అక్టోబర్ 29: పుత్తూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పీడీ నారాయణస్వామి గారు మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల ప్రజలను ఉద్దేశించి తన విజ్ఞప్తిని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో ఓటర్లు తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను నిరంతరం పోరాడుతానని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా ముందుండి స్పందించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మున్సిపాలిటీలోని 36 వార్డుల ప్రజల ఆదరాభిమానాలతో తనను గెలిపించాలని, ప్రజాసేవకు అవకాశం కల్పించాలని పీడీ నారాయణస్వామి విజ్ఞప్తి చేశారు.

ప్రజల సమస్యలే తన ప్రాధాన్యం.. ప్రజాసేవే తన లక్ష్యం అని పీడీ నారాయణస్వామి తెలిపారు.