sathyavelugu.com
Date of Publish : 28 October 2026, 10:24 pm Posted by : Dr. S.sudhakar

పుత్తూరు 15వ వార్డులో జై జగన్ నినాదాల హోరు!

-వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి జై ప్రకాష్‌కు ప్రజల మద్దతు వెల్లువ!

సత్య వెలుగు న్యూస్ పుత్తూరు అక్టోబర్ 28: పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో వైఎస్సార్‌సీపీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జై ప్రకాష్ ఈరోజు 15వ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో ప్రజల నుంచి ఆయనకు మంచి స్పందన లభించింది.

జయ ప్రకాష్ ప్రచారానికి మద్దతుగా స్థానిక ప్రజలు “జై జగన్.. జై జగన్!” అంటూ నినాదాలు చేశారు. రానున్న ఎన్నికల్లో తమ ఓట్లతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు.

15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాజేశ్వరి రత్నం గారికి, చైర్మన్ అభ్యర్థి జై ప్రకాష్ గారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్థానిక ప్రజలు హామీ ఇచ్చినట్లు ప్రచార కార్యక్రమంలో వెల్లడించారు.