పుత్తూరు 15వ వార్డులో జై జగన్ నినాదాల హోరు!

-వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి జై ప్రకాష్‌కు ప్రజల మద్దతు వెల్లువ! సత్య వెలుగు న్యూస్ పుత్తూరు అక్టోబర్ 28: పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో వైఎస్సార్‌సీపీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జై ప్రకాష్ ఈరోజు 15వ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో ప్రజల నుంచి ఆయనకు మంచి స్పందన లభించింది. జయ ప్రకాష్ ప్రచారానికి మద్దతుగా స్థానిక ప్రజలు “జై జగన్.. జై జగన్!” అంటూ నినాదాలు చేశారు. రానున్న ఎన్నికల్లో తమ ఓట్లతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు...