పుత్తూరు 17వ వార్డులో సీపీఐ అభ్యర్థి ఏ. రోజా ఇంటింటి ప్రచారం!
-వార్డు సమస్యల పరిష్కారానికి కౌన్సిల్లో పోరాడుతాం: సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మురళి సత్య వెలుగు న్యూస్ పుత్తూరు, అక్టోబర్ 29: పుత్తూరు మున్సిపాలిటీలోని 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అభ్యర్థి ఏ. రోజాకు ప్రజలు మద్దతు తెలిపి గెలిపించాలని సీపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 10 గంటలకు పుత్తూరు పట్టణంలోని 17వ వార్డులో సీపీఐ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఏ. రోజా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ...