sathyavelugu.com
Date of Publish : 24 October 2026, 10:05 am Posted by : Dr. S.sudhakar

బాబు నాయుడు ఆధ్వర్యంలో 17వ వార్డులో టీడీపీ ప్రచారం

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు ,అక్టోబర్ 23:
పుత్తూరు: మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో ఎల్.ఎన్.టి. బాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థి హెచ్. అజితకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు నాయుడు స్థానికులను కలిసి హెచ్. అజితను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టారు. వార్డులోని ఓటర్లను కలిసి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.