రహస్య మరణంతో కలకలం

సత్య వెలుగు న్యూస్,మాస్కో, అక్టోబర్ 6, : రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్న అంటువ్యాధుల పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న యువ ఉద్యోగిని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఇర్కుట్స్క్ ప్రాంతంలోని అంటువ్యాధుల పరిశోధన సంస్థలో విధులు నిర్వహిస్తున్న 28 ఏళ్ల డార్యా షిపిలోవా తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధితో ఆసుపత్రిలో చేరి అనంతరం మరణించినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ప్రజారోగ్య భద్రత, పరిశోధన కేంద్రాల భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డార్యా షిపిలోవా మరణానికి...