వర్షం కోసం ఎదురుచూస్తున్న వరి పంట పొలాలు

దొరవారిసత్రం మండలంలో రైతుల ఆశలు వాన పైనే దొరవారిసత్రం - సత్యవేలుగు న్యూస్ : దొరవారిసత్రం మండలంలోని యేకొల్లు, నెలబల్లి, వేణుంబాకం, మీజూరు, తల్లంపాడు, పూలతోట, అక్కరపాక తదితర గ్రామాల్లో వరి సాగుపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. పంటలకు అవసరమైన వర్షాలు సకాలంలో కురవాలని రైతులు ఎదురుచూస్తున్నారు. సాగునీటి కొరత ఏర్పడితే వరి నాట్లు వేయడం, ఇప్పటికే సాగు చేసిన పంటలను కాపాడుకోవడం కష్టమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, ఇతర నీటి వనరుల్లో నీరు చేరితే వ్యవసాయానికి మేలు...