వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వార్షికోత్సవం సందర్భంగా పుత్తూరులో 5కే వాక్‌థాన్
పుత్తూరు, అక్టోబర్ 17, సత్య వెలుగు న్యూస్: వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 18) పుత్తూరులో 5కే వాక్‌థాన్ నిర్వహించనున్నట్లు వాకర్స్ ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ కోనేటి రవిరాజు తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటలకు పుత్తూరులోని వాకర్స్ బిల్డింగ్ నుంచి వాక్‌థాన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అక్కడి నుంచి కె.ఎన్. రోడ్డు సర్కిల్‌కు చేరుకుని కేక్ కట్ చేసిన అనంతరం, ద్రౌపదమ్మ గుడి, బజారు వీధి మీదుగా బాలికల జూనియర్ కళాశాల వరకు ర్యాలీ కొనసాగుతుందని వివరించారు. వాకర్స్...