విజయపురం మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు , స్వర్గీయ శ్రీ శివరాజు గారికి ఘన నివాళులు

విజయపురం, సత్య వెలుగు న్యూస్: మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వర్గీయ శ్రీ శివరాజు గారి అకాల మరణవార్త పట్ల మాజీ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కే. రోజా గారి సోదరులు శ్రీ వై. కుమారస్వామి రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వర్గీయ శ్రీ శివరాజు గారి భౌతికకాయానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి రెడ్డి గారు...