విజయవాడ 45వ డివిజన్లో సీపీఐ అభ్యర్థి బెవర ఇందిర ఎన్నికల ప్రచారం స్థానిక సమస్యలపై ఆరా.. ప్రజలతో మమేకం విజయవాడ,
విజయవాడ, సత్య వెలుగు న్యూస్:విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 45వ డివిజన్లో సీపీఐ అభ్యర్థి శ్రీమతి బెవర ఇందిర పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల దైనందిన జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులు, మౌలిక సదుపాయాల కొరత, స్థానికంగా పరిష్కరించాల్సిన సమస్యలపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా ప్రచారాన్ని...