వీరపరెడ్డిపాలెంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ సమావేశం
-మాదిగల హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి: నీరుపాకు వినోద్ కుమార్ మాదిగ పుత్తూరు, సత్య వెలుగు న్యూస్,అక్టోబర్ 21 :ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, ఎంఎస్పీ రాష్ట్ర సీనియర్ నాయకులు, తిరుపతి జిల్లా ఇన్చార్జ్ వర్ల దేవదాసు మాదిగ సూచనలతో నగరి నియోజకవర్గం, పుత్తూరు మండలం, పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని వీరపరెడ్డిపాలెం మాదిగ పల్లెలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. వీరపరెడ్డిపాలెం గ్రామ ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు తిరుపతి మహేష్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి...