సాధనవారిపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం.. కారుపై విరిగిపడిన విద్యుత్ స్తంభం

-విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం సూళ్లూరుపేట,సత్య వెలుగు న్యూస్: సూళ్లూరుపేట నుంచి బుచ్చినాయుడుకండ్రిగకు వెళ్లే మార్గంలో సాధనవారిపాలెం గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం విరిగి కారుపై పడటంతో కారు కొంతమేర దెబ్బతింది. విరిగిన విద్యుత్ స్తంభం లైవ్‌ పవర్‌లో ఉండటంతో అక్కడి ప్రజలు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదాన్ని గుర్తించిన అక్కడి ప్రయాణికులు వెంటనే స్పందించి కారులో ఉన్న వారిని...