-నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం..
-144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు
సత్య వెలుగు న్యూస్ | తిరుపతి | అక్టోబర్ 16, 2026:స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు.
నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిబంధనల మేరకు 144 సెక్షన్‌తో పాటు 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నారు.
అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ప్రజల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ నిరంతర నిఘా కొనసాగిస్తోంది.