sathyavelugu.com
Date of Publish : 18 October 2026, 9:29 pm Posted by : Dr.K.Suresh Editor

నాయుడుపేట మున్సిపల్‌ చైర్మన్‌ స్థానానికి 14 నామినేషన్లు.. వార్డు సభ్యుల స్థానాలకు 170 దాఖలు!

సత్య వెలుగు న్యూస్ – నాయుడుపేట:

నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో చైర్మన్‌, వార్డు సభ్యుల స్థానాలకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్‌ చైర్మన్‌ స్థానానికి వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 14 నామినేషన్లు దాఖలు చేయగా, 32 వార్డుల పరిధిలో వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 170 నామినేషన్లు దాఖలైనట్లు వివరాలు వెల్లడయ్యాయి.

చైర్మన్‌ స్థానానికి దాఖలైన నామినేషన్ల వివరాలు:

  • టీడీపీ – 3
  • వైఎస్సార్‌సీపీ – 5
  • బీఎస్‌పీ – 2
  • ఆమ్‌ ఆద్మీ పార్టీ – 1
  • స్వతంత్ర అభ్యర్థులు – 3

మొత్తం: 14 నామినేషన్లు

32 వార్డుల పరిధిలో వార్డు సభ్యుల నామినేషన్ల వివరాలు:

  • బీజేపీ – 10
  • సీపీఎం – 2
  • ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ – 2
  • టీడీపీ – 59
  • వైఎస్సార్‌సీపీ – 81
  • జనసేన – 3
  • స్వతంత్ర అభ్యర్థులు – 13

మొత్తం: 170 నామినేషన్లు

నాయుడుపేట మున్సిపాలిటీలో చైర్మన్‌ స్థానంతో పాటు 32 వార్డుల పరిధిలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికల ప్రక్రియలో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. తదుపరి ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది.