నాయుడుపేట మున్సిపల్‌ చైర్మన్‌ స్థానానికి 14 నామినేషన్లు.. వార్డు సభ్యుల స్థానాలకు 170 దాఖలు!

సత్య వెలుగు న్యూస్ – నాయుడుపేట: నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో చైర్మన్‌, వార్డు సభ్యుల స్థానాలకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్‌ చైర్మన్‌ స్థానానికి వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 14 నామినేషన్లు దాఖలు చేయగా, 32 వార్డుల పరిధిలో వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 170 నామినేషన్లు దాఖలైనట్లు వివరాలు వెల్లడయ్యాయి. చైర్మన్‌ స్థానానికి దాఖలైన నామినేషన్ల వివరాలు: టీడీపీ – 3 వైఎస్సార్‌సీపీ – 5 బీఎస్‌పీ – 2 ఆమ్‌ ఆద్మీ పార్టీ...