పెళ్లకూరు మండలంలో 8 ఎంపీటీసీ నామినేషన్లు తిరస్కరణ 10 ఎంపీటీసీ స్థానాలకు 38 నామినేషన్లు.. 30 ఆమోదం

పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్:పెళ్లకూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 38 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన అనంతరం 30 నామినేషన్లు ఆమోదం పొందాయి. మరో 8 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఆమోదం పొందిన నామినేషన్లలో బీజేపీ నుంచి 2, జనసేన నుంచి 4, టీడీపీ నుంచి 19, వైఎస్సార్‌సీపీ నుంచి 5 ఉన్నాయి. తిరస్కరణకు గురైన వాటిలో టీడీపీ నుంచి 2, వైఎస్సార్‌సీపీ నుంచి 6 నామినేషన్లు ఉన్నట్లు సమాచారం....