sathyavelugu.com
Date of Publish : 18 October 2026, 10:33 pm Posted by : Dr.K.Suresh Editor

వెంకటగిరి మున్సిపల్‌ చైర్మన్‌ స్థానానికి 9 నామినేషన్లు.. వార్డు సభ్యుల స్థానాలకు 216 దాఖలు!

సత్య వెలుగు న్యూస్ – వెంకటగిరి:వెంకటగిరి మున్సిపాలిటీలో ఎన్నికల సందడి నెలకొంది. మున్సిపల్‌ చైర్మన్‌ స్థానానికి 9 నామినేషన్లు దాఖలు కాగా, 36 వార్డుల పరిధిలో వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 216 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు.

చైర్మన్‌ స్థానానికి దాఖలైన నామినేషన్లు:

  • బీఎస్పీ – 2
  • టీడీపీ – 3
  • వైఎస్సార్‌సీపీ – 3
  • ఆమ్‌ ఆద్మీ పార్టీ – 1
  • స్వతంత్ర అభ్యర్థులు – 1

మొత్తం: 9 నామినేషన్లు

36 వార్డుల పరిధిలో వార్డు సభ్యుల నామినేషన్ల వివరాలు:

  • బీజేపీ – 4
  • సీపీఐ – 1
  • సీపీఎం – 1
  • టీడీపీ – 103
  • వైఎస్సార్‌సీపీ – 91
  • జనసేన – 5
  • స్వతంత్ర అభ్యర్థులు – 11

మొత్తం: 216 నామినేషన్లు

వెంకటగిరి మున్సిపాలిటీలో చైర్మన్‌ స్థానంతో పాటు వార్డు సభ్యుల స్థానాలకు వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ అనంతరం తుది బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది.