పందిలపల్లిలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం , గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారంపై అవగాహన

చౌడేపల్లి, అక్టోబర్ 5,సత్య వెలుగు న్యూస్: చౌడేపల్లి మండలం పందిరిపల్లి పంచాయతీ పరిధిలోని పందిలపల్లి, కొత్తపల్లి గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారుల్లో పోషకాహార లోపాలను నివారించడంతో పాటు, పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. చిన్నారులకు సమృద్ధిగా పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారులకు అవసరమైన పోషక విలువలు కలిగిన...