చారాల పంచాయతీలో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
చౌడేపల్లి, అక్టోబర్ 2 — సత్య వెలుగు న్యూస్: చౌడేపల్లి మండలంలోని చారాల పంచాయతీ పరిధిలో ఓ వ్యక్తి ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. చారాల పంచాయతీ పరిధిలోని కురపల్లికి చెందిన అలీ ఖాన్ (42) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి పెళ్లి కార్యక్రమానికి దాచేపల్లికి వెళ్లి అనంతరం ఇంటికి తిరిగి వచ్చినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని చింత చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో అలీ ఖాన్ కనిపించాడు. స్థానికులు విషయాన్ని పోలీసులకు...