అనుభవానికి పట్టం కడితే.. నాయుడుపేట అభివృద్ధికి కొత్త దిశ! సన్నారెడ్డి దయాకర్ రెడ్డికి మున్సిపల్ చైర్మన్గా అవకాశం కల్పించాలి
-విద్యార్థి దశ నుంచి జాతీయ స్థాయి వరకు రాజకీయ ప్రస్థానం.. పట్టణ అభివృద్ధికి అనుభవజ్ఞుడైన నాయకత్వం అవసరం! సత్య వెలుగు న్యూస్ – నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలు రాజకీయ చర్చల్లో ప్రధానంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాయుడుపేట మున్సిపల్ చైర్మన్ పదవికి అనుభవజ్ఞులైన నాయకులకు అవకాశం కల్పించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే ప్రజా...