నంది మంగళంలో పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం
పుత్తూరు, సత్య వెలుగు న్యూస్: పుత్తూరు మండలం నంది మంగళం గ్రామంలో పుత్తూరు డివిజన్ డీఎస్పీ, సీఐ, ఎస్ఐల ఆధ్వర్యంలో గ్రామస్తులు, యువకులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి బానిసత్వం వల్ల కలిగే దుష్పరిణామాలపై పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపొద్దు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు. ఓవర్స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్లో ప్రయాణించడం వంటి నిబంధనల ఉల్లంఘనల వల్ల ప్రాణాంతక...