విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి.. గునపాడులో విషాదం
-విద్యుత్ మరమ్మతుల సమయంలో ప్రమాదం.. -బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి సత్య వెలుగు న్యూస్ , చిట్టమూరు:తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గునపాడు గ్రామానికి చెందిన గంగపట్నం మహేష్ విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. గురువారం రాత్రి కురిసిన వర్షం కారణంగా విద్యుత్ లైన్లు తెగిపోవడంతో మరమ్మతులు చేపట్టిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.గునపాడులో విద్యుత్ మరమ్మతుల సమయంలో ప్రమాదం స్థానికుల కథనం ప్రకారం, గ్రామంలో విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పుడు రోజువారీ వేతనంపై కొందరు యువకులతో...