ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలి ఆమ్ ఆద్మీ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జి పట్టపు రవి డిమాండ్
నాయుడుపేట, అక్టోబర్ 3 — సత్య వెలుగు న్యూస్: తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో శనివారం జరిగిన భారీ పేలుడు ఘటనకు గల కారణాలను పూర్తిస్థాయిలో వెలికితీసి, ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జి పట్టపు రవి డిమాండ్ చేశారు. శ్రీసిటీలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో పలువురు కార్మికులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా అధికారులు నిర్ధారించాల్సి ఉంది. ఈ సందర్భంగా పట్టపు...