స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులకు ఏడిపిఎస్ మద్దతు!

-ఏడిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యరబోతు సుబ్రహ్మణ్యం ప్రకటన సత్య వెలుగు న్యూస్ | అక్టోబర్ 30 | సూళ్లూరుపేట:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థులకు అంబేద్కర్ ధర్మ పోరాట సమితి (ఏడిపిఎస్) నాయకులు, కార్యకర్తలు మద్దతుగా నిలవాలని ఏడిపిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు యరబోతు సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుజనుల ఆత్మగౌరవం, రాజకీయ స్వాభిమానం, రాజ్యాధికార సాధనే లక్ష్యంగా బహుజన సమాజం రాజకీయంగా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ...