కోట మండలంలో వైసీపీ ఎన్నికల దూకుడు.. 16 ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల పోటీ!

-కార్యకర్తలకు అండగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి.. ప్రచారంలో చురుకైన పాత్ర సత్య వెలుగు న్యూస్ | అక్టోబర్ 30 | కోట:“గిరగిరా తిరుగుతుంది ఫ్యాను.. అబ్బా అయ్యా.. నేను జగనన్న ఫ్యాను!” అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తున్న నినాదాలు కోట మండల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. అధికారంలో లేకపోయినా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. కోట మండలంలోని మొత్తం 16 ఎంపీటీసీ స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలో నిలపడం స్థానిక రాజకీయాల్లో...