బోయకొండలో భక్తులను అలరించిన అమావాస్య చండీ హోమం

చౌడేపల్లి, అక్టోబర్ 10, సత్య వెలుగు న్యూస్:ప్రముఖ శక్తి క్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి నెలా అమావాస్య సందర్భంగా నిర్వహించే ఈ హోమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఉదయాన్నే వేద పండితుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ హోమ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంతో చండీ హోమం ముగిసింది. ఈ సందర్భంగా బోయకొండ గంగమ్మ...